శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వి.ఆర్. గూడెంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సువ్వారి రామారావు(35) అనే వ్యక్తి మృతి చెందాడు.
రామారావు అతని తమ్ముడు రాజుకు మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి. ఆ వివాదాలకు పక్కింటి వాళ్లే కారణమని రామరావు అనుమానించాడు. మద్యం మత్తులో వారితో గొడవ పడ్డాడు. సూర్యనారాయణ, రాజారావు కర్రతో రామారావు తలపై బలంగా కొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సూర్యనారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.లక్ష్మణ్ రావు తెలిపారు.
ఇదీ చదవండి: కన్న తల్లిని వద్దనుకున్నారు.. కనికరం లేకుండా రోడ్డుపై వదిలేశారు!