ETV Bharat / state

వంశధార - నాగావళికి పెరుగుతున్న వరద ఉద్ధృతి - water

వంశధార - నాగావళి నదులకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. గొట్టా బ్యారేజీ, తోటపల్లి వద్ద పెరుగుతున్న వరద నీరు పెద్దఎత్తున చేరుతోంది. రాష్ట్ర అత్యవసర విపత్తు నిర్వహణ సెంటర్ నుంచి కమిషనర్ పరిశీలిస్తున్నారు. ప్రభావిత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

nagavali-water-flow
author img

By

Published : Aug 7, 2019, 10:02 AM IST

Updated : Aug 7, 2019, 10:56 AM IST

పెరుగుతున్న వరద ఉద్ధృతి

వంశధార-నాగావళి నదికి వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ఒడిశాలో కురుస్తున్న వర్షాలు... శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి వర్షాల ప్రభావంతో.... గొట్టాబ్యారేజ్, తోటపల్లి వద్ద ప్రవాహం పెరిగింది. వచ్చిన నీటిని వచ్చినట్లు... అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. లక్ష క్యూసెక్కుల వరకు వరదనీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వంశధార నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.... అధికారులు సూచించారు. పరిస్థితిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా పర్యవేక్షిస్తోంది.

వంశధార - నాగావళికి పెరుగుతున్న వరద ఉద్ధృతి

ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో నాగావళి నదిలో వరదనీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. వరద నీరంతా... విజయనగరం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 23 వేల 800 క్యూసెక్కుల నీరు వస్తుండగా... 17 వేల101 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. నాగవళి వరద కారణంగా.. జియ్యమ్మవలస మండలంలోని ముంపు గ్రామమైన బాసంగి బీసీ కాలనీలోకి వరద నీరు ప్రవేశించింది. స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద 3 అడుగుల మేరకు నీరు చేరింది. గరుగుబిల్లి మండలం నాగురూ, ఉల్లిభద్ర, కొమరాడ మండలం పాతకళ్లికోట గ్రామాల్లో పంట పొలాలు మునిగిపోయాయి.

ఇవి కూడా చదవండి:

871 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం

Intro:భానుడి ప్రతాపం

Body:భానుడు భగభగ మండు తున్నాడు జిల్లా అగ్నిగోళంలా మారుతుంది ఎన్నడూ లేనివిధంగా అత్యధిక వేడితో ప్రజలను ఉడికించేచేస్తున్నాడు ఆకు కథలను అంతగా ఊపిరి తీసుకో లేనంతగా వేడి గాలులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి శనివారం ఒక్కసారిగా జిల్లాలో ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలో కాయగా ఒక ఆత్మకూరు లో మాత్రం జిల్లాలో అధిక శాతం 48 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా ఉదయగిరిలో 46 ఉష్ణోగ్రత నమోదైంది అంతకుమించి ఉష్ణోగ్రత ఈరోజు కూడా కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరిగి ప్రజలు బయటికి రాలేక తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు ఈ ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు ఉదయం పది గంటలకి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు నిన్న జిల్లాలోనే అత్యధికంగా 48 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఆత్మకూరులో నమోదైతే ఉదయగిరిలో 46 ఉష్ణోగ్రత నమోదైంది ఈరోజు నిన్నటి కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు ప్రజలు బయటకు రాకుండా వృద్ధులు పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో లో వడదెబ్బతో ఆరు మంది వరకు వృద్ధులు చనిపోవడం జరిగింది

Conclusion: కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
Last Updated : Aug 7, 2019, 10:56 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.