ETV Bharat / state

హైదరాబాద్‌‌లో దారుణ ఘటన.. అతి కిరాతంగా వ్యక్తిని నరికి చంపిన దుండగులు - Andhra Pradesh viral news

Kulsumpura Murder Live Video: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో దారుణ ఘటన జరిగింది. కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జియాగూడ రోడ్డుపై ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు వెంటాడి, వేటాడి మరీ అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

hyderabad
హైదరాబాద్‌‌లో దారుణ ఘటన
author img

By

Published : Jan 23, 2023, 1:43 PM IST

హైదరాబాద్‌‌లో దారుణ హత్య.. వెంటాడి మరీ నరికి చంపారు

Kulsumpura Murder Live Video: ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో స్వైర విహారం చేశారు. ఓ వ్యక్తిని నడి రోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. ఆదివారం సాయంత్రం అందరూ చూస్తుండగానే హైదరాబాద్‌లోని పురానాపూల్‌ సమీపంలోని జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఈ దారుణ ఘటన జరిగింది. జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతడిని మరో ముగ్గురు తరుముకుంటూ వచ్చారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కుల్సుంపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆధార్‌ కార్డు వివరాల ప్రకారం.. కోఠి ఇస్తామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌(32)గా పోలీసులు గుర్తించారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితులు ఎవరు? ఎందుకు అతన్ని హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

హత్య చేసిన తరువాత నిందితులు పక్కనే ఉన్న మూసీ నదిలో దూకి పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, హత్య జరుగుతున్న సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోలీసుల దర్యాప్తునకు ఈ వీడియో కీలకంగా మారింది.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.