శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీల్లోని మొత్తం 74 స్థానాలకు 336 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారంతో ఈ గడువు ముగిసింది. శనివారం నామినేషన్ల పరిశీలిస్తారు. అనంతరం ఉపసంహరణలు మొదలవుతాయి. పురపాలికల్లో నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. అధికార పార్టీ వైకాపాతో పాటు తెదేపా అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని చోట్ల భాజపా, జనసేనలు ఉమ్మడిగా తమ అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించాయి. పాలకొండలో అత్యధికంగా 17 మంది స్వతంత్రులు నామినేషన్లు వేయడం గమనార్హం. పలాసలో ఒక్కచోట మాత్రమే కాంగ్రెసు అభ్యర్థి నామినేషన్‌కు ముందుకొచ్చారు. పలాస, పాలకొండల్లో ఒక్కోస్థానంలో సీపీఐ.. పాలకొండలో ఒకచోట సీపీఎం తరపున అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ఇదీ చదవండి : 'వైకాపాకు ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేదు'