ETV Bharat / state

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌ గృహ నిర్బంధం - ఎమ్మెల్యే బెందాళం అశోక్​ హౌజ్ అరెస్టు న్యూస్

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్​ను గృహ నిర్బంధం చేశారు. తెదేపా నేత కళా వెంకట్రావును కలిసేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలో భారీ బందోబస్తును మోహరించారు.

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌ గృహ నిర్బంధం
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌ గృహ నిర్బంధం
author img

By

Published : Jan 21, 2021, 9:07 AM IST

తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావును కలిసేందుకు సిద్ధమైన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

ఏమైందంటే..

మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంలో అదుపులోకి తీసుకున్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఆయన వాహన శ్రేణిపై రాళ్లు, చెప్పులు వేయించారనే అభియోగంపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు వెంకటరావుపై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులోనే కళా వెంకటరావును పోలీసులు అదుపులోకి తీసుకుని.. తర్వాత వదిలిపెట్టారు. ఆయనను పరామర్శించేందుకు వెళ్తుండగా.. అశోక్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

ఇదీ చదవండి: కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని వదిలేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.