వంశధార ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో కోటి 98 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు సూపరింటెండెంట్ పర్యవేక్షణ ఇంజినీర్ కార్యాలయ భవనాన్ని... సభాపతి తమ్మినేని సీతారాం.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులతో కలిసి ప్రారంభించారు.
జిల్లాకు ప్రధానమైన నీటి వనరు వంశధార ప్రాజెక్టు అని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత గల జలవనరుల ప్రాజెక్టుల్లో వంశధారను చేర్చామన్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారం కూడా త్వరలో అందిస్తామని తెలిపారు. నదులకు శ్రీకాకుళం జిల్లా నిలయమని సభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు.
ఇదీ చదవండి: