అధైర్య పడొద్దు...అండగా ఉంటాం : మంత్రి కృష్ణదాస్ ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్రలోని వంశధార నదికి వరద పోటెత్తింది. వరద ఉద్ధృతి, సహాయక చర్యలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరా తీశారు. నది పరివాహక ప్రాంత్రాల్లో ఆయన పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని నది పరివాహక గ్రామాల్లో పర్యటించిన మంత్రి కృష్ణదాస్ వరద పరిస్థితి పరిశీలించారు. సరుబుజ్జిలి మండలం అంధవరం, రామకృష్టాపురం, ఉప్పరపేట గ్రామాల్లోనూ మంత్రి పరిశీలించారు. ప్రజలను అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి : వాసిరెడ్డి పద్మకు కీలక బాధ్యతలు అప్పగించిన జగన్