ETV Bharat / state

వైసీపీ పాలనలో.. మా పార్టీ కార్యకర్తలు, నాయకులకే నష్టం కలిగింది: మంత్రి ధర్మాన - చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఆగ్రహం

MINISTER DHARMANA ON YCP LEADERS: వైసీపీ పాలనలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకే నష్టం కలిగిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుకు ఓటు వేస్తే మీకే నష్టం కలుగుతుందన్నారు.

MINISTER DHARMANA ON YCP LEADERS
MINISTER DHARMANA ON YCP LEADERS
author img

By

Published : Jan 21, 2023, 9:06 AM IST

Updated : Jan 21, 2023, 9:31 AM IST

MINISTER DHARMANA ON YCP LEADERS : చంద్రబాబుకు అధికారం ఇస్తే సంక్షేమ పథకాలన్నింటినీ ఆపేస్తారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు గ్రామంలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మేం రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని చెబుతున్నారంటే మీకు సంక్షేమ పథకాలివ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. పార్టీ ప్రయోజనాల కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు.

వైసీపీ పాలనలో.. మా పార్టీ కార్యకర్తలు, నాయుకులకే నష్టం కలిగింది

కరోనా సమయంలో ఇంట్లో పొయ్యి వెలగలేదు. ఎక్కడా ఆకలితో ఉన్నారనే మాటరాకుండా 9 నెలలు పార్టీ కార్యకర్తలు.. అంటే... వాలంటీర్లు ఇంటింటికీ సరకులు తెచ్చి ఇచ్చారు. టీవీ చూస్తే ఏదో జరిగిపోతోందని చెబుతుంటారు. టీవీల్లో వస్తున్న దాన్ని కాదు.. గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రభుత్వ పనితీరు అంచనా వేయండి. కొన్ని పత్రికలు, టీవీలు కొన్ని పార్టీల కోసమే పుట్టాయి. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని వద్దంటున్నారు. దీన్ని వ్యతిరేకించాలి.

విశాఖ రాజధాని వస్తే ఇక్కడ పెట్టుబడులొస్తాయి. దాంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ జిల్లాకు చంద్రబాబు గతంలోనూ చేసిందేమీ లేదు. ఆయన మాయమాటలు నమ్మడానికి వీల్లేదు. చంద్రబాబు అధికారంలోకి రాకుండా చేయాలి. విశాఖ రాజధానిని అమరావతికి తీసుకువెళ్లడానికి అంగీకరించబోమని, మీ కుటుంబాలు హాయిగా ఉండేందుకు కారణమైన వైసీపీ ప్రభుత్వ విధానాలను కొనసాగించేందుకు సహకరిస్తామని మీరంతా చెప్పాలి’ అని మంత్రి ధర్మాన అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 21, 2023, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.