రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష తెలుగుదేశం అడుగడుగునా మోకాలడ్డుతోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంపై చంద్రబాబు కపటి ప్రేమ చూపుతున్నారని వ్యాఖ్యానించారు. కేవలం కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి ఉద్యమం జరుగుతోందని మంత్రి అన్నారు.
ముంబయికి ధీటుగా విశాఖను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని... దీనిని తెలుగుదేశం అడ్డుకుంటోందని విమర్శించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి