Minister Botsa Satyanarayana Comments On TDP, Janasena: వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు తోటపల్లి ప్రాజెక్ట్‌పై మాట్లాడిన అంశాలపై కూడా స్పందించారు. చంద్రబాబు తోటపల్లి ప్రాజెక్టు తానే నిర్మించానని చెప్పుకోవటం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కూడా మంత్రి బొత్స స్పందించారు. ముఖ్యమంత్రి జగన్‌పై ఎవరూ విమర్శలు చేసినా ఘాటుగా స్పందిస్తానని హెచ్చరించారు.
గుండు కొట్టించుకుంటా: రాబోయే ఏడాది ఉగాది తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్రంలో ఉంటే గుండు కొట్టుంచుకుంటానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెండు ప్రతిపక్షాలు ఉన్నాయని.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే వ్యక్తి ఒకరు.. అవగాహనలేని మాటలు మాట్లాడే సెలబ్రెటీ మరొకరని ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ సీఎం, ప్రధానిమీద మాట్లాడితే పెద్ద వాడైపోయానుకుంటున్నాడని.. ఆయన విధానం ఏంటని.. పార్టీ ఏంటంటే సమాధానం చెప్పాలేడని అన్నారు. పవన్ కల్యాణ్ ఇష్టా రాజ్యాంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Minister Botsa Satyanarayana on Punganur incident పుంగనూరు ఘటన దురదృష్టకరం.. మంత్రి అనుచరులు రెచ్చగోడితే రెచ్చిపోవాలా..?: మంత్రి బొత్స
ఎంతవరకు సమంజసం: 15 సంవత్సరాలు క్రితం పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి.. పార్టీ మూసేసిన తర్వాత.. పవన్ కల్యాణ్ దుకాణం తెరిచారని ఎద్దేవా చేశారు. రాత్రి ఒక మాట, మధ్యాహ్నం మరో మాట, సాయంత్రం ఇంకొక మాట.. సెట్ అయితే ఓ విధంగా, సెట్ కాకపొతే మరో విధంగా మాట్లాడడం మాకు తెలియదని మండిపడ్డారు. తోటపల్లి ప్రోజెక్ట్‌కి తానే శంకుస్థాపన చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్ట్‌ని ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి.. ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా తానే నిర్మించానని అనటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
అభిమానంతో విగ్రహాలు పెట్టారు: ఎంతసేపు రాజకీయాలే తప్ప చంద్రబాబుకి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఎందుకు అని వైజాగ్‌లో ఓ వ్యక్తి అంటుంటే ఆశ్చర్యం వేసిందని అన్నారు. విగ్రహాలు జగన్ పెట్టామన్నారా.. విజయమ్మ పెట్టమన్నారా.. అభిమానంతో పెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తే.. ఇలానే ఘాటుగా ప్రతి స్పందిస్తానని మంత్రి బొత్స హెచ్చరించారు.
"రెండు రాజకీయ పార్టీలు ఉండవు. ఉంటే నేను గుండు కొట్టించుకుంటా. ఈ పార్టీలో ఉన్నానని గొప్పగా చెప్పుకోవటం కాదు. నాకున్న అనుభవంతో చెప్తున్న. చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రిని తిట్టడం." -బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి