రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను మరింతగా మెరుగుపరుస్తామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పర్యటించిన ఆయన.. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జీజీహెచ్లో సదుపాయాల కల్పనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను అదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ కేసుల విస్తృతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు మంత్రులకు వివరించారు. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించేందుకు రూ.16 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ల పెంపు విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పేదవారందరికీ ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఆళ్ల నాని అన్నారు.
ఇదీ చదవండి : అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి