మానసిక ఉల్లాసానికి, శరీర ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహద పడతాయని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండల విద్యాశాఖ అధికారి కరమున అప్పారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు విభాగాల్లో ఎనిమిదో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు క్రీడా పోటీలు ప్రారంభించారు. స్థానిక సురంగి రాజా మైదానంలో ఈ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్, వాలీబాల్, యోగా పోటీల్లో వందల సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:
ఆ ప్రాంతం...అరకు జిల్లాలో చేరనుందా..? ‘శ్రీకాకుళం నుంచి విడిపోనుందా..!