కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం తెదేపా కార్యాలయంలో ఆయన 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ పెద్దలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ట్రూనాట్ టెస్టులను నిలిపివేయాలని ఐసీఎంఆర్ ఆదేశించినా పట్టించుకోకుండా సర్కారు ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతోందని ఆరోపించారు. పేదల ఆకలిని కూడా తీర్చలేకపోతోందని మండిపడ్డారు. దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి..