శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలగా జాతీయ రహదారిపై ఈనెల 10న ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని పక్కా సమాచారం ప్రకారం పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు కోటి రూపాయాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గంజాయిని ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితమే గంజాయిని పట్టుకున్నా... భారీ మెుత్తంలో ఉండటంతో నేడు తూకం వేసి వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: