శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులు, భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాజాం, పాలకొండ, భామిని, బూర్జ, సీతంపేట, వీరఘట్టం, ఎచ్చెర్ల, లావేరు, రేగిడి తదితర మండలాల్లో కురిసిన వర్షానికి పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. వీరఘట్టం మండలంలోని చెట్టు కూలి కారు ధ్వంసం అయ్యింది. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లావేరు మండలం జాతీయ రహదారి తాళ్లవలస గ్రామానికి సమీపంలోని చెట్లపై పిడుగులు పడటంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
వర్షానికి ముందు భారీ ఎత్తున ఈదురుగాలులు, ఉరుములతో పాటు ఎక్కడికక్కడ పిడుగులు పడుతుండటంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలో వారం రోజుల వ్యవధిలో పిడుగుపాటుకు గురై సుమారు 8 మంది వరకు మృతి చెందారు.
ఇవీ చూడండి...