శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గంగుపేటలో వర్షాలు కురవాలని రైతులు గ్రామ దేవతకు మొక్కులు చెల్లించారు. మంగళవారం సాయంత్రం గ్రామంలో రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంతకాలంగా వర్షాలు లేక పోవడం వలన తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని.. గ్రామ దేవత అసిరితల్లి కరుణించి వర్షాలు కురిపించాలని వేడుకొన్నారు. పసుపు నీళ్లు, వేపాకులు ముర్రాటతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
ఇది కూడా చదవండి.