కరోనాను ఎదుర్కోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందింకి ఎలాంటి సామాగ్రిని మంజూరు చేయలేదన్నారు. అన్ని రాష్ట్రాలు ప్రభుత్వం సాయం కింద ప్రజలకు 5 వేలు ఇస్తుంటే...వైకాపా మాత్రం వెయ్యి రూపాయలతో చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ప్రజలు సహకరించి ఎవరింట్లో వాళ్లు ఉన్నారే తప్ప...ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదన్నారు.
ఇదీచదవండి