స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న పేరు మీద ప్రత్యేక తపాలా కవర్‌ను ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విడుదల చేశారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో తపాలా శాఖ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌తో పాటు లచ్చన్న తనయుడు గౌతు శ్యాంసుందరశివాజీ, లచ్చన్న మనవరాలు గౌతు శిరీష, మరికొందరు హాజరయ్యారు.
లచ్చన్న మహోన్నత వ్యక్తి అని కృష్ణదాస్.. ఎన్‌జీ రంగాను శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేయించడం కోసం తన పదవిని త్యాగం చేశారని కొనియాడారు.
గౌతు లచ్చన్న ద్వారా జిల్లా కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మన చరిత్ర, సంస్కృతిని, సాంప్రదాయాలను తెలుసుకునే అవకాశం అజాది కా అమృత్ మహోత్సవం పెట్టడం వల్ల జరిగిందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.
ఇదీ చదవండి: