శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ పరిశీలించారు. కేంద్రంలో ఉండే ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆయన మండిపడ్డారు. రోడ్లపై ఉన్న పేదలకు నాయకులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలే మంచినీళ్లు, భోజనం అందిస్తున్నాయే తప్ప ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్రాల్లో ఉన్నవారికి పూర్తిస్థాయి వైద్య సేవలు అందించడంతో పాటు, భోజన వసతి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.