ఇచ్చాపురంలో అగ్నిప్రమాదం.. 10 ఎకరాల్లో జీడిమామిడి తోట దగ్ధం - ఇచ్చాపురం అగ్నిప్రమాదంలో జీడిమామిడి పంట దగ్దం
అగ్నిప్రమాదంలో 10 ఎకరాల్లోని జీడి మామిడి తోటలు దగ్ధమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో ఈ ఘటన జరిగింది.
fire accident in ichaapuram
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 ఎకరాల్లోని జీడి మామిడి తోటలు దగ్ధమయ్యాయి. తీర ప్రాంతం కావడంతో మత్స్యకారులు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు, వలలు కాలి బూడిదయ్యాయి. తుపాను సంబంధిత విధుల్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అధికారులు పంటనష్టాన్ని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా పంటలు కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.