Ram Gopal Varma Cheque Bounce Case : దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి ముంబయి అంధేరి కోర్టు 3 నెలల జైలుశిక్ష విధించింది. రామ్‌గోపాల్‌వర్మపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో మహేష్‌చంద్ర అనే వ్యక్తి ఆర్జీవీపై చెక్ బౌన్స్ కేసు పెట్టారు. ఈ కేసుపై విచారణ సందర్భంగా ఆర్జీవీకి శిక్ష విధిస్తూ అంధేరి కోర్టు తీర్పు ఇచ్చింది. ఫిర్యాదుదారుడికి రూ. 3.7 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మూడు నెలల్లోగా పరిహారం చెల్లించాలని లేకుంటే ఆర్జీవీకి మరో 3 నెలలు సాధారణ జైలుశిక్ష విధిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
ఏపీలో నమోదైన కేసుల్లో కొనసాగుతున్న విచారణ.. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వివిధ ఠాణాల్లో నమోదైన కేసులలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని వర్మకు స్పష్టం చేసింది.
ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం ఠాణాల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల సంతృప్తి మేరకు రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని రాంగోపాల్ వర్మను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. పీపీ స్పందిస్తూ రాంగోపాల్ వర్మ నోటీసులకు స్పందించడం లేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ కోర్టు ఆదేశాలకు కట్టుబడి వ్యవహరించకపోతే బెయిలు రద్దు కోసం చట్టనిబంధనల మేరకు పోలీసులు చర్యలు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
AP Fibernet Corporation on RGV : అలాగే వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆర్టీవీకి నోటీసులు పంపింన విషయం తెలిసిందే. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్‌నెట్ నుంచి కోటీ 15 లక్షల రూపాయల మేర అనుచితంగా లబ్ధి పొందడంపై రామ్‌గోపాల్‌వర్మకు లీగల్ నోటీస్ జారీచేశారు. ఈ మేరకు ఫైబర్‌నెట్ ఛైర్మన్ జి.వి.రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్‌నెట్ ఎండీ సహా ఐదుగురికి నోటీసులిచ్చారు.
అరెస్టు చేస్తే జైల్లో నాలుగు సినిమా కథలు రాసుకుంటా: రాంగోపాల్ వర్మ
'RGV సినిమా ఒక్కసారి చూస్తే రూ.11వేలు' - నోటీసులు పంపిన APSFL