Baking Soda Cleaning Tips : రోజూ మనం వంటింట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలే అద్భుతాలను చేస్తాయి. బజ్జీలు, ఇడ్లీ, దోశ పిండిలో ఉపయోగించే వంటసోడా కూడా ఈ కోవలోకే వస్తుంది. వంటసోడా సోడియం బైకార్బోనేట్‌గా పిలుస్తారు. అయితే, ఈ వంటసోడాను వంటల్లోనే కాకుండా కిచెన్, బాత్రూమ్లోని టైల్స్, ఇంట్లోని స్టెయిన్లెస్ స్టీల్ ట్యాప్స్ శుభ్రం చేయడానికీ ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బేకింగ్ సోడాతో వీటిని ఎలా క్లీన్ చేయాలో మీకు తెలుసా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్టెయిల్‌లెస్ స్టీల్ ట్యాప్స్ :
ముందుగా గిన్నెలో కొద్దిగా వంట సోడా తీసుకుని నీళ్లు కలిపి పేస్ట్‌లాగా చేయండి. ఈ మిశ్రమాన్ని స్టెయిల్‌లెస్ స్టీల్ ట్యాప్‌కి పట్టించి అరగంట సేపు నాననివ్వండి. ఆపై టూత్‌బ్రష్‌తో ట్యాప్‌పైన రుద్ది వాటర్‌తో క్లీన్ చేయండి. అంతే ట్యాప్ మెరిసిపోతుంది.
బాత్రూమ్లోని టైల్స్ :
బాత్రూమ్లోని ఫ్లోర్, టైల్స్‌ని శుభ్రపరచడానికి ముందుగా టైల్స్‌పై బేకింగ్ సోడాని చల్లండి. ఆపై కొన్ని నీళ్లు చల్లుతూ బ్రష్‌తో టైల్స్‌ని రుద్దండి. అనంతరం నీళ్లతో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు బేకింగ్ సోడాతో పాటు నిమ్మరసం లేదా వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు.
మెహందీ :
మెహందీ త్వరగా పోవాలంటే టీ స్పూన్ బేకింగ్ సోడాను అరచేతిలో వేసి రెండు నిమిషాలు రుద్దండి. ఇలా రెండు రోజులు క్రమంగా చేస్తే ఫలితం దక్కుతుంది.
టీ మరకలు :
కొన్నిసార్లు అనుకోకుండా దుస్తులపై టీ మరకలు పడుతుంటాయి. వీటిని ఎంత రుద్దినా మరకలు తొలగిపోవు. ఇలాంటి సమయంలో అక్కడ కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, నిమ్మ చెక్కతో రుద్దండి. ఇలా కాసేపు రుద్దడం వల్ల ఈజీగా మరక మాయం అవుతుంది.
- రొట్టెలు, అప్పడాలు, కేకులు, బిస్కెట్లు వీటి తయారీలో వంట సోడా వాడటం వల్ల అవి కాస్త పులిసి పొంగుతాయి. అలాగే త్వరగానూ ఉడుకుతాయి.
- ఇంట్లో చెత్త బుట్ట, ఫ్రిడ్జ్, బాత్రూమ్ ఇలా ఎక్కడినుంచి అయినా బ్యాడ్‌స్మెల్ వస్తుంటే అక్కడ కాస్త బేకింగ్ సోడా చల్లడమో, ఓ కప్పులో వేసి ఉంచడమో చేయండి. ఇలా చేయడం వల్ల దుర్వాసన ఇట్టే పోతుంది.
- కిచెన్‌లో సింక్ శుభ్రంగా ఉంటే మహిళలకు ఎంతో వీలుగా ఉంటుంది. అయితే, కొన్నిసార్లు గిన్నెలు తోముతుండగా సింకు గొట్టంలో వ్యర్థాలు పేరుకుని నీళ్లు ఆగిపోతాయి. ఇలాంటి సమయంలో వేడి వేడి నీళ్లల్లో కప్పు బేకింగ్ సోడా వేసి అందులో పోయండి. దీంతో సింక్‌లోని వాటర్ సులువుగా పోతాయి.
- కిచెన్‌లోని టైల్స్, గ్యాస్ స్టవ్, దాని వెనక గోడ, అవెన్ వంటి వాటిని రోజూ క్లీన్ చేసినా సరే జిడ్డు పట్టేస్తాయి. ఇలాంటప్పుడు రెండు కప్పుల బేకింగ్ సోడా తీసుకుని కాస్త నిమ్మరసం కలిపి, రాసి ఆరనివ్వండి. అనంతరం పీచుతో రుద్దేయండి. ఇలా చేస్తే మరకలు తొలగిపోయి తళతళలాడతాయి.
- కొన్నిసార్లు మట్టిలో తేమ ఎక్కువై మొక్కలపై ఫంగల్ వ్యాధులు దాడి చేస్తాయి. దీంతో అవి ఎండిపోయి ఆకులు మొత్తం రాలిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో కప్పు బేకింగ్ సోడాను అక్కడ చల్లి వదిలేయండి. రెండు మూడు రోజులకు సమస్య దూరమవుతుంది.
శ్మశానాలు, బురద గుంతల్లో పెళ్లికూతుళ్లు! - ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వింత పోకడలు!
'తగ్గేదేలే'! - ఆ విషయంలో తెలంగాణను మించిపోయిన ఏపీ - దేశంలో నాలుగో స్థానం