శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో.. రహదారి పక్కన ఆపి ఉంచిన కారు నుంచి మంటలు చెలరేగాయి. సంతబొమ్మాళి మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ముడిదాన బాబూరావు కారు ఇంజన్ భాగం ఈ ఘటనలో కాలిపోయింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేయగా.. వాహనంలో ఉన్న మరో వ్యక్తికి ప్రమాదం తప్పింది. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: