ETV Bharat / state

సిక్కోలులో భారీ వర్షాలు... మొక్కజొన్న రైతులకు కష్టాలు

ఓ వైపు కత్తెర పురుగు... మరోవైపు భారీగా కురుస్తోన్న వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న రైతులను ఇబ్బందుల్లోకి నెట్టాయి. పంట పూర్తిగా తడిసి కంకుల్లో నుంచి మొలకలు వస్తున్నాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

భారీ వర్షాలు... అన్నదాతల్లో కన్నీళ్లు
author img

By

Published : Oct 22, 2019, 6:26 PM IST

భారీ వర్షాలు... అన్నదాతల్లో కన్నీళ్లు

శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్​లో సుమారుగా 15,900 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే దాదాపు 9 వేల హెక్టార్లలో పంట సాగయ్యింది. అయితే పంట వేసినప్పటి నుంచి కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. పంట మొక్క, కోత దశల్లో కత్తెర పురుగు సోకి సగానికి పైగా పంట నాశనమైంది. ప్రస్తుతం జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలు మొక్కజొన్న రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. తీసిన పంట 20 రోజులుగా కళ్లాల్లోనే ఉండిపోవడం వల్ల కంకుల్లో నుంచి మొలకలు వస్తున్నాయని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

'పరిహారం కోసం.. వర్షంలోనూ అన్నదాతల ఆందోళన'

Intro:AP_SKLM_21_22_kundapotha_varsham_Mokajonna_Rytulu_Gaggolu_av_AP10139

మొక్కజొన్న రైతుకు వర్షం ఎఫెక్ట్... ఆందోళనలో అన్నదాతలు

శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ లో మొక్కజొన్న పంటను రైతులు సుమారుగా 15,900 హెక్టర్ లలో సాగు చేశారు. అయితే పంట వేసిన అప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్ప లేదు. పంట మొక్క, కోత దశలలో కత్తెర పురుగు సోకి సగానికిపైగా పంట నాశనమైంది. గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్ళల్లో వేసిన పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీసిన పంట 20 రోజులుగా కళ్ళల్లో ఉండిపోవడంతో కంకులుల్లో నుంచి మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలో మొక్కజొన్న పంటను ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో సుమారుగా తొమ్మిది వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షం మొక్కజొన్న రైతుల పాలిట శాపంగా మారిందని నియోజకవర్గం రైతులు వాపోతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోని పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

Body:మొక్కజొన్న రైతులు గగ్గోలు

Conclusion:మొక్కజొన్న రైతులు గగ్గోలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.