మహిళల రక్షణకు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక అస్త్రమే దిశా యాప్ అని శ్రీకాకుళం జిల్లా పాలకొండ డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. ప్రతి మహిళ దీనిపై అవగాహన పెంచుకోవాలని ఆమె కోరారు. ఈ యాప్ వినియోగించడం ద్వారా ఘటన స్థలానికి క్షణాల్లో పోలీసులు వచ్చి కాపాడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్ మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించలన్నారు.
శానిటైజర్ వినియోగంతో పాటు తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు, కర్ఫ్యూ ఉందన్న విషయాన్ని గ్రహించాలని చెప్పారు. సాయంత్ర ఐదు గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలన్నారు. ఆరుగంటలకు అందరూ ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. సాయంత్రం ఆరు తర్వాత బయట కనిపిస్తే సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు రూ. రెండు వేలు జరిమానా విధిస్తామన్నారు. మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. నిషేధిత గుట్కా విక్రయాలు, రవాణాపై నిఘా ఉంచామన్నారు. నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: