శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృష్ణాపురం జంక్షన్ వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ తనిఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్ పరిశీలించారు. ఎన్నిక పూర్తయ్యేవరకు ప్రతీ వాహనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశించారు. వాహనం ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో వివరాలు నమోదు చేయాలని చెప్పారు. రాత్రి సమయాల్లో నిఘా మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట రాజు, ఎలక్షన్ డిప్యూటీ తాహసీల్దారు మురళీ నాయక్, ఏవో రవీంద్రపవన్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి: శ్రీకాకుళంలో 885 సర్పంచ్, 2048 వార్డు సభ్యుల నామినేషన్