శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడలో ఉద్రిక్తత నెలకొంది. చెరువు వద్ద ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. మందరాడ ప్రధాన రహదారి పక్కనే ఉన్న చెరువు వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు.. మండల అధికారులు తొలగింపు పనులు చేపట్టారు.
తహసీల్దార్ గోవిందరావు, ఎస్సై రామారావులతోపాటు జేసీబీతో నిర్మాణాలను తొలగిస్తుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. కొంతమేర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కావాలనే ఇళ్లను తొలగిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: