శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలోని కోదండరామ వీధికి చెందిన ముద్దాడ లావణ్యకు ఓ అపరిచిత వ్యక్తి ఫోను చేసి ఈకేవైసీ చేయించుకోవాలని, తాను పంపించే లింక్ తెరచి వివరాలు నమోదుచేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన లావణ్య వివరాలను నమోదు చేయగా...కాసేపటికి 5 వేల రూపాయల నగదు ఖాతా నుంచి తీసినట్లు, ఫోన్కు మెసేజ్ వచ్చింది. కొద్ది గంటల్లో మరో రూ.10వేలు స్వాహా చేశాడు.
మొదటిసారి నగదు తీసుకున్న సమయంలో సంబంధిత వ్యక్తి కి ఫోన్ లో సంప్రదిస్తే ఆందోళన చెందొద్దని, 24 గంటల్లో నగదు తిరిగి ఖాతాలో జమ అవుతుందని నమ్మించాడని బాధితురాలు వాపోయింది. ప్రస్తుతం తమకు జరిగిన మోసంపై బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ఇవీ చూడండి