వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్రప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన మేరకు దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ రైల్వే స్టేషన్లో ఆకలితో వలస కార్మికురాలు మృతి చెందిన సంఘటన కలిచి వేసిందన్నారు. రాష్ట్రంలో ఒక వలస కార్మికురాలు రోడ్డు మీదే ప్రసవించడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సరైన రీతిలో వారిని స్వస్థలాలకు తరలించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి.. కన్న కొడుకును ఎత్తుకోకుండానే.. కాటికి వెళ్తున్నాడు!