శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించటంతో జిల్లా ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్ డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా వాసులు 48 గంటలపాటు స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు పలు గ్రామాల్లోని ప్రధాన వీధుల్లోకి కొత్త వారిని రానివ్వకుండా రహదారులకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇవీ చూడండి
కరోనా ఆసుపత్రులు పరిశీలించిన మంత్రి ధర్మాన