ETV Bharat / state

'ఇసుక మాఫియా, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోండి'

author img

By

Published : Nov 26, 2020, 6:45 PM IST

ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నవారిపై.. వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్చాపురం నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త పిరియా సాయిరాజ్ కోరారు. ఈ మేరకు తహసీల్దార్ మురళీమోహన్, రూరల్ ఎస్ఐ లక్ష్మిలకు ఫిర్యాదు చేశారు.

Complain to take action against sand mafia
ఇసుక మాఫీయాపై చర్యులు తీసుకోవాలని ఫిర్యాదు

బాహుదానది పరివాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియా, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్చాపురం నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త పిరియా సాయిరాజ్ కోరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తహసీల్దార్ మురళీమోహన్, రూరల్ ఎస్ఐ కె.లక్ష్మిలకు ఫిర్యాదు చేశారు. ప్రజలందరికీ ఇసుక సక్రమంగా అందాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక పాలసీ అని ప్రకటిస్తే.. అక్రమంగా ఇసుకను దోచేస్తూ సామాన్య ప్రజలకు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగుతుందన్న వారు.. వెంటనే వారిపై, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ ప్రతినిధి చాట్ల తులసీదాసు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, పార్టీ నాయకులు కారంగి మోహన్ రావు, గుజ్జు జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

శ్రీకాకుళం జిల్లాలో 'నివర్' ప్రభావం...ఆందోళనలో అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.