ETV Bharat / state

శుభ్రతే రక్షణ కవచం.. పాటించండి ప్రతి క్షణం - నందికొట్కూరులో లాక్​డౌన్

కరోనా వైరస్ కట్టడికి అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోడియం హైడ్రో క్లోరైడ్​, డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్​తో ప్రజలపై హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. దుకాణాలను మూసివేసి ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని పోలీసులు వాహనంలో తిరుగుతూ హెచ్చరికలు జారీ చేశారు.

chemical sprays at  state
రాష్ట్రంలో రసాయన పిచికారీలు
author img

By

Published : Apr 7, 2020, 10:50 AM IST

Updated : Apr 7, 2020, 12:29 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమవుతున్నారు. కరోనా వైరస్ విస్తరించకుండా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అగ్నిమాపక వాహనంతో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మొత్తం వీధులు తడిసేలా సోడియం క్లోరైడ్​తో పరిశుభ్రం చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాల సంఘం పరిధిలోని మార్కెట్ ప్రాంగణం ముఖ ద్వారం వద్ద కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్​ ఏర్పాటు చేశారు. వచ్చీ పోయేవారందరికీ వైరస్ నాశక రసాయనాన్ని తుంపరలు తుంపరలుగా పడేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఏర్పాటుల.. జిల్లాలోనే మొదటిదని ఆర్డీఓ ఉమాదేవి, మునిసిపల్ కమిషనర్ రమేష్​లు తెలిపారు.

కర్నూలు జిల్లా నందికొట్కూరులో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంగయ్యపేటలో మండల పరిధిలో ఒక కేసు నమోదవగా ఆ ప్రాంతాలను రెడ్​జోన్లుగా ప్రకటించారు. బందోబస్తును కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. పాణ్యంలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై.. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నారు. గడివేముల మండల పరిధిలోని ఆయా ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. మూడు కిలోమీటర్ల వరకు రెడ్​జోన్​గా ప్రకటించి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అధికారులు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. దుకాణాలను మూసివేసి ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని పోలీసులు వాహనంలో తిరుగుతూ హెచ్చరికలు జారీ చేశారు.

కడప జిల్లా మైదుకూరులో సాయినాథపురానికి చెందిన దంపతులకు కరోనా పాజిటివ్‌ రావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. వారు ఉంటున్న నివాస ప్రాంత వీధిలో బ్లీచింగ్‌ పొడిని చల్లించారు. హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఆ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించిన అధికారులు.. ఇళ్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. అటు పోలీసులు ఇటు పురపాలిక, వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:

పేదలకు సాయంపై అధికార పార్టీ స్టిక్కర్​!

Last Updated : Apr 7, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.