మా కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం ఏంటి...? శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రోటోకాల్ ఉల్లంఘనపై కమిటి ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైకాపా నాయకులు తెదేపా ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అధికారులూ వారి తీరులో నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలవంకలో మొక్కల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్నామనీ తెలిసీ కూడా ముందుగా వైకాపా నాయకులు వెళ్లి... అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడమేంటని ప్రశ్నించారు..? ఇలా తరచూ చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. అధికారులు ఈ విషయంపై స్పందించి స్పష్టమైన హామీ ప్రకటించే వరకూ నిరసన కొనసాగిస్తామన్నారు.ఇదీ చూడండి:"న్యాయ విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలి"