People panic in srikakulam: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో ఇటీవల ఎలుగుబంట్ల సంచారం పెరిగిపోయింది. వాటి దాడిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన పలువురు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలుగుబంట్ల సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. తాజాగా.. ఓ టీ దుకాణంలో పిల్లలతో కలిసి ఎలుగుబంటి తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి: