శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఉద్దానంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువవుతోంది. జీడి పంట సమయం కావడం వల్ల.. గ్రామాల్లోకి వీటి రాక పెరిగింది. సాయంత్రం కాగానే గుంపులు గుంపులుగా ఇవి సంచరిస్తున్నాయి. రట్టి, బహడపల్లి, బిడిమి కొండలు స్థావరంగా చేసుకొన్న ఎలుగుబంట్లు.. జీడి, కొబ్బరి తోటల్లో కనిపిస్తున్నాయి. హరిపురం నుంచి రట్టి వైపు వెళ్లే వాహనదారులను ఎలుగుబంట్లు అడ్డగిస్తున్నాయి. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: చిన్నిగుండెకు కొండంత అండ... మూడు నెలల్లో 120 శస్త్రచికిత్సలు