శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఆర్డీవో టి.ఎస్.కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం హైపో సోడియం ద్రావణం పిచికారి ప్రారంభించారు స్వయంగా ఆర్డీవో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 20 వార్డుల పరిధిలో పిచికారి చేయిస్తామన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ లాక్ డౌన్‌ను పటిష్ఠంగా అమలుచేయాలన్నారు.
ఇచ్ఛాపురంలో
జిల్లాలోని ఇచ్ఛాపురంలో కరోనా వైరస్ ప్రైవేటు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను స్వర్ణ భారతి విద్యాసంస్థల ఛైర్మన్ తులసీదాస్ రెడ్డి ఆధ్వర్యంలో తమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వంద మందికి పైగా ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులు అందజేశారు.