శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని కొత్త చెలికానివలస గ్రామంలో వాలంటీర్‌పై పలువురు దాడి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉన్నవారి ఇళ్లకి స్టిక్కర్ అంటించేందుకు వెళ్లిన అతనిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో వాలంటీర్ కుటుంబ సభ్యులు వారిపై ఎదురుదాడికి దిగారు. ఈ తగాదాలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తే.. నేరుగా క్వారంటైన్కే!