ETV Bharat / state

ఆ ప్రాంతం...అరకు జిల్లాలో చేరనుందా..? ‘శ్రీకాకుళం నుంచి విడిపోనుందా..! - Ambiguity over the merger of palakonda

శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ శాసనసభ నియోజకవర్గం విడిపోతుందా... కొత్తగా ఏర్పాటు చేస్తారంటున్న ‘అరకు’ జిల్లాలో విలీనం అవుతుందా..? మూడు జిల్లాల ప్రతిపాదన పట్టాలెక్కితే అదే జరుగుతుందా..? అనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

Ambiguity over the merger of  palakonda
పాలకొండ విలీనంపై విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో సందిగ్దత
author img

By

Published : Jan 29, 2020, 8:00 PM IST

ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తామని... వైకాపా ఎన్నికల ప్రణాళికలో చేర్చడం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ‘పాలకొండ’ శాసనసభ నియోజకవర్గం అరకు పార్లమెంటు పరిధిలో ఉండటం వల్ల... పాలకొండ విలీనంపై సహజంగానే చర్చకు ప్రాధాన్యం చేకూరుతోంది. అరకు లోక్‌సభ స్థానం పరిధి విస్తృతంగా ఉండటం వల్ల... ఇతర పార్లమెంటు నియోజకవర్గాలను ఏర్పాటు చేసినట్లుగానే.. ఈ స్థానాన్ని ఒకే జిల్లాగా ఏర్పాటు చేయడం సాధ్యమా అనేది అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. నిడివి దృష్ట్యా ‘పాలకొండ’ విలీనానికి అవకాశాలు తక్కువేనన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

మూడు జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలా..!

అరకులో వైద్య కళాశాలను ప్రభుత్వం మంజూరు చేయడం వల్ల... మూడు జిల్లాల అంశం తెరపైకి వచ్చింది. వెనకబడి ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే... అందుకయ్యే వ్యయంలో 60శాతం వరకు భారత వైద్య మండలి (ఎంసీఐ) సమకూర్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని తొలి దశలో మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు భావిస్తున్నారు.

ఇక మిగిలేది అవేనా!
పార్లమెంటు నియోజకవర్గాల పరిధి మేరకు జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న... సీఎం జగన్ ఆలోచనతో శ్రీకాకుళం జిల్లా కొత్తగా ఏర్పాటయ్యే మూడు జిల్లాల పరిధిలోకి విస్తరించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు... శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో ఉన్నాయి. ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలోనూ.. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం అరకు లోక్‌సభ స్థానం పరిధిలోనూ విస్తరించాయి. ఈ క్రమంలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిని ఒక జిల్లాగా చేస్తే.. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గాలు మాత్రమే ఈ జిల్లాలో మిగిలే అవకాశం ఉంది.

అలాగా...ఇలాగా?
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి.. ఈ నాలుగు జిల్లాల్లో అరకు పార్లమెంటు నియోజకవర్గం విస్తరించి ఉంది. ఈ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ స్థానం గిరిజన వర్గాలకు కేటాయించారు. దీని పరిధిలోని పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేల స్థానాలూ ఆ వర్గం కిందనే ఉన్నాయి. ఒక్క పార్వతీపురం నియోజకవర్గం మాత్రం ఎస్సీ కేటగిరీలో చేరింది.

ఒకవైపు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నుంచి మరో వైపు శ్రీకాకుళం జిల్లా భామిని మండలం వరకు అరకు పార్లమెంటు స్థానం విస్తరించి ఉంది. రమారమి 500 కి.మీ విస్తరించి ఉండటంతో.. ఆసక్తికర చర్చ సాగుతోంది. పార్వతీపురం, కురుపాం వరకు విస్తరణను సరిపెట్టినా.. అరకునే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తారా..? పార్వతీపురాన్ని కేంద్రంగా మారుస్తారా అన్న ప్రతిపాదనలు వచ్చేటట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రతిపాదనలే పరిగణనలోకి తీసుకుంటే.. దూరాభారం నుంచి ‘పాలకొండ’ బయట పడినట్లే..!!

ఇదీ చూడండి: 'టిడ్కోలో రివర్స్‌ టెండరింగ్‌తో 30 కోట్లు ఆదా చేశాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.