Private School Van Accident: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని కేదారపురం గ్రామ సమీపంలో విద్యార్థులతో వెళుతున్న ఒక టాటా మ్యాజిక్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా.. ఇచ్చాపురం పట్టణ ప్రభుత్వాసుపత్రిలో కొందరికి, ప్రైవేట్ ఆస్పత్రిలో మరికొందరికి చికిత్స అందించారు. ఇచ్చాపురం పట్టణంలో ఉన్న రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సరిహద్దు ఒడిశా పితాతొలి గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు వివిధ తరగతులలో చదువుతున్నారు. సుమారు 16 మంది విద్యార్థులతో సోమవారం ఉదయం ఆ గ్రామం నుంచి బయలుదేరిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టాటా మ్యాజిక్ వాహనం ముచ్చింద్ర గ్రామం వద్ద ఒక చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్‌తో పాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు విద్యార్థులు, డ్రైవర్‌ను ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి, మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు స్వల్ప గాయాలే కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వాహన డ్రైవర్ పరిమితికి మించిన వేగంతో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. వేగంతో వాహనం నడిపిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: