శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని గొల్లవీధికి చెందిన 85 ఏళ్ల బుజ్జమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఓ కుమారుడు చనిపోగా మరో కుమారుడు బెల్లుపడు కాలనీలో చిన్న దుకాణం పెట్టుకొని జీవిస్తున్నాడు. అయితే సొంతిల్లు అమ్మడంతో బుజ్జమ్మ.. తోటవీధిలో కూతురుతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమెకు వచ్చే పింఛను తీసుకొని కుమార్తె భోజనం పెట్టేది. ఈ క్రమంలో తల్లి వద్ద ఉన్న బంగారం కూడా కుమార్తె తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు ఆమె వద్ద ఎం లేకపోయేసరికే.. నీతో మాకు సంబంధం లేదు అంటూ.. తల్లిని స్థానిక గొల్లవీధి మండపం వద్ద వదిలేశారు. కడపున పుట్టినవాళ్లే గెంటేయడంతో ఎటు వెళ్లాలో తెలియక ఆ 85 ఏళ్ల బుజ్జమ్మ.. ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. స్థానికులు ఆమెకు కావలసిన అవసరాలను తీరుస్తున్నారు. అధికారులు స్పందించి వృద్ధురాలు బుజ్జమ్మకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి.. lokesh: మరో పీఎస్కు లోకేశ్ తరలింపు.. విడుదలపై స్పష్టత ఇవ్వని పోలీసులు