శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరి నాయుడుపేట గ్రామంలో ఓ వ్యక్తికి పొడవాటి మీనం చిక్కింది. అయితే దీనికి తోక లేకపోవటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
గ్రామానికి చెందిన అప్పలనాయుడు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లినప్పుడు కాలువలో 4 అడుగుల పొడవు ఉన్న చేప కనిపించింది. శరీరం పొడవునా పార్శపు మొప్పలు మాత్రమే ఉన్నా ఈ మీనానికి... తోక లేదు. నాలుగు అడుగుల పొడవు, 6 కిలోలకు పైగా బరువు ఉంది. ఇలాంటి చేపలు మంచినీటి చెరువులు, డ్యాముల్లో అరుదుగా కనిపిస్తుంటాయని మత్స్యకార ఏడీ దిలీప్ తెలిపారు.
ఇదీ చదవండి