ETV Bharat / state

స్నేహితుడిని తీసుకొచ్చేందుకని వెళ్లి... అనుమానాస్పద స్థితిలో మృతి..! - శ్రీకాకుళంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం భర్తుపురం గ్రామానికి చెందిన బాగాది నవీన్ భైరిబొడ్డపాడు వద్ద అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నవీన్ మృతిపై అతని కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

A man was allegedly killed in Bhairiboddapadu in Nandigam zone of Srikakulam district
స్నేహితుడిని తీసుకొచ్చేందుకు వెళ్లి అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
author img

By

Published : Feb 25, 2021, 5:00 PM IST

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం భర్తుపురం గ్రామానికి చెందిన బాగాది నవీన్ (22) అనుమానాస్పద స్థితిలో భైరిబొడ్డపాడు వద్ద మృతిచెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నవీన్ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అతని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నవీన్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..

శ్రీకాకుళం నుంచి వస్తున్న స్నేహితుడిని తీసుకొచ్చేందుకు బాగాది నవీన్ అదే గ్రామానికి చెందిన బాగాది జగన్నాయకులుతో కలసి నిన్న సాయంత్రం ద్విచక్ర వాహనంపై టెక్కలి వెళ్లారు. అనంతరం స్నేహితుడితో కలిసి ముగ్గురూ టెక్కలిలో మద్యం సేవించారు. అక్కడి నుంచి గ్రామానికి తిరిగొస్తున్న క్రమంలో భైరిబొడ్డపాడు వద్ద నవీన్ అస్వస్థతకు గురై.. వాంతులు చేసుకున్నాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు నవీన్​ని అక్కడే వదిలి గ్రామానికి చేరుకున్నారు. ఉదయం భైరిబొడ్డపాడు పొలం గట్టు వద్ద నవీన్ శవమై కనిపించాడు.

నవీన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇద్దరు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

'తప్పుడు పత్రాలు సృష్టించి భూములు లాక్కుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.