TDP Leader Jaggu: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలుగుదేశం కార్యకర్త జగ్గు బంధువు పద్మావతి ఆరోపించారు. ఇటీవల బత్తలపల్లి మండలం గంటాపురంలో టీడీపీ కార్యకర్త జగ్గును పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అంతకుముందు వైసీపీ నాయకులు కొంతమంది జగ్గును హత్య చేయాలని దాడి చేసినట్లు పద్మావతి తెలిపారు. వైసీపీ నేతల అరాచకాలపై ఎస్పీని కలవడానికి వస్తే.. పోలీసులు అడ్డుకున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను గతంలో హత్య చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తన మరిదిని కూడా.. హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. జగ్గుపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: