Naveen Nischal YSRCP: నూతన సంవత్సర వేడుకల్లో హిందూపురం వైసీపీ నేత నిశ్చల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం హిందూపురంలో వైసీపీ పేరు చెప్పుకుంటూ అధికారం అనుభవిస్తున్నవారు, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోతే.. కొందరు నేతలు పార్టీలో కనిపించరంటూ వ్యాఖ్యానించారు. హిందూపురంలో ప్రజలను కులాలు, మతాల వారిగా విడగొట్టి నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి వారిని హిందూపురం కుంటలు-చెరువుల్లో ముంచేయాలంటూ.. నిశ్చల్, వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.
దున్నేది మనమైతే పంటను కోసుకు వెళ్లేవారు మాత్రం వేరేవాళ్లని ఆయన ఆరోపించారు. పార్టీ నేతలు ఆలోచించి నియోజకవర్గంలోని ఉన్న స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జెండా మోసినవారికి న్యాయం జరగలేదు కానీ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి న్యాయం చేస్తున్నారని నిశ్చల్ ఆరోపించారు. తామంతా పార్టీ కోసం కష్టపడి ఆస్తులను కోల్పోయామనీ, నిన్నమెున్న వచ్చిన వారు ఈ రోజు మనల్ని వెనక్కి నెట్టి ముందుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వేళ 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోతే ఇప్ప్పుడున్న నేతలంతా మళ్లీ పార్టీలో కనిపించరని ఎద్దేవా చేశారు. అప్పుడు సైతం మనమే పార్టీకి పల్లకి మోసేవారిగా కనిపిస్తామని పేర్కొన్నారు.
మతాలు, కులాల వారిగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ అవసరాలకోసం ప్రజల్ని ప్రోత్సహించకుడదు. ముఖ్యంగా మన వైసీపీలో కులరాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. దున్నేది మనమైతే పంటను కోసుకు వెళ్లేవారు మాత్రం వేరేవాళ్లు. పార్టీ నేతలు ఆలోచించి నియోజకవర్గంలోని ఉన్న స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలి. జెండా మోసినవారికి న్యాయం జరగలేదు కానీ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి న్యాయం చేస్తున్నారు. తామంతా పార్టీ కోసం కష్టపడి ఆస్తులను కోల్పోయాం. నవీన్ నిశ్చల్, వైసీపీ నేత
ఇవీ చదవండి