Bhuthappa Utsavalu in Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు మూడు రోజుల నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భూతప్పలు భక్తులను కాలితో తొక్కే ఘటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాల ముందు భూతప్పల వేషధారణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు భక్తులపై నడుచుకుంటూ వెళ్లారు. భూతప్పల కాలి స్పర్శతో కోరికలు నెరుగుతాయనే ప్రగాఢ నమ్మకంతో ఉత్సవానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఇవీ చదవండి: