ETV Bharat / state

లోకేశ్ పాదయాత్రకు వైసీపీ భయపడుతోంది: బాలకృష్ణ - హిందూపురంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన బాలయ్య

Balakrishna About Lokesh Padayatra: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లోకేశ్ పాదయాత్ర గురించి మాట్లాడారు.

NBK
బాలకృష్ణ
author img

By

Published : Jan 26, 2023, 4:24 PM IST

MLA Balakrishna Hindupuram Tour: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి వచ్చిన బాలకృష్ణకు చిలమత్తూరు మండలం కోడికొండ చెక్​పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు అంబిక లక్ష్మీనారాయణ కూతురు వివాహానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు హాజరయ్యారు. పట్టణంలోని ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వివాహ వేడుకల్లో బాలకృష్ణ వసుంధర దంపతులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రను చూసి అధికార పార్టీ భయపడుతోందని.. అందుకే అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని హిందూపురం బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామానికి రూ.35 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి స్వయంగా జేసీబీ యంత్రాన్ని నడిపారు.

వైసీపీ ప్రభుత్వంలో ఒక పరిశ్రమ లేదు.. ఉపాధి ఉద్యోగాలే లేవని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అలాగే హిందూపురం పట్టణంలోని సరస్వతీ విద్యా మందిరంలో హెరిటేజ్ సంస్థ ఆర్థిక సహకారంతో పాఠశాలకు కంప్యూటర్లను వితరణ చేశారు. అనంతరం విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు వల్లే ఈ ప్రాంతంలో అనేక పాఠశాలలు వచ్చాయని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.