Subbarao Guptha On Kodali Nani : మంత్రి కొడాలి నానితో వైకాపాకు తీవ్ర నష్టం జరుగుతోందని.. ముఖ్యమంత్రి జగన్ ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత సుబ్బారావు గుప్తా కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని వల్ల గుడివాడలో జరుగుతున్న వ్యవహారాలతో పాటు.. ఆయన మాటతీరు అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని.. పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా కొడాలి శైలి ఉందని విమర్శించారు. ఓటేయాలంటేనే బాధపడే పరిస్థితికి తీసుకొస్తున్నారని సుబ్బారావు గుప్తా ఆక్షేపించారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు. బాలినేని శ్రీనివాస రెడ్డి.. కమలహాసన్ లా గొప్ప నటుడని, అతని కుమారుడు ప్రణీత్ రెడ్డి వల్ల కూడా పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు.
ఇదీ చదవండి : Four Districts JAC Meet : నాలుగు జిల్లాల జేఏసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!