ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని సుభాష్ రోడ్డులో భ్రమరాంబిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమెకు మూడు సంవత్సరాల క్రితం చీరాలవాసి ఆంధ్రా బ్యాంకు మేనేజర్ సిరిగిరి లింగారావుతో వివాహమైంది. ఆ సమయంలో కట్నంగా భారీగా డబ్బు, బంగారం ఇచ్చామని మృతురాలి తండ్రి రామకృష్ణారావు తెలిపారు.
అయినా... అదనపు కట్నం కోసం అల్లుడు లింగారావు తన కుమార్తెను వేధించేవాడని అతని తల్లి లింగమ్మ, తమ్ముళ్లు, చెల్లెలు అందరూ కలసి భ్రమరాంబికను దారుణంగా కొట్టి, చంపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: