ఒంగోలులో మూడ్రోజులకొకసారి మాత్రమే మంచి నీరు సరఫరా అవుతుంది. ఇలా విడుదలయ్యే నీటిలో అధికశాతం పైపుల లీకులతో నేలపాలు అవుతుంది. ఈ వృథాతో శివారు ప్రాంతాల వారికి నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకులకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో మరో రెండు రోజులూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు!