నియోజకవర్గ కేంద్రం దర్శి మండలంలోని చలివేంద్రం ప్రజలు... 15 ఏళ్లుగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామం దర్శికి 5 కిలోమిటర్ల దూరంలో ఉంది. పల్లెలో మొత్తం 65 నుంచి 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. నీటి సమస్యే కాదు... ఆ పల్లెలో కనీస వసతుల కల్పన అంతంత మాత్రమే! అంతర్గత రహదారులపై తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవు. ఏ వీధిలో చూసినా దుర్గంధమే..1
చలివేంద్రంలో నీళ్లట్యాంకులు, చేతిపంపులు అలంకారప్రాయంగా మిగిలాయి. ఈ పల్లెవాసులు నీళ్లు తెచ్చుకోవాలంటే... ఇతర ప్రాంతానికి వెళ్లాల్సిందే. నేతలు ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు అడుగుతారే తప్ప... తరువాత కన్నెత్తి చూడరని బాధితులు దీనంగా చెబుతున్నారు. అటు అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యమని వాపోతున్నారు.
దర్శి నియోజకవర్గంలోని 5మండలాల పరిధిలో.. 144 గ్రామాలకు మంచినీరు అందించేందుకు... నెదర్లాండ్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఎన్ఏపీ చెరువు సుదూరంలో ఉంది. అక్కడి నుంచి తమ ప్రాంతానికి నీరు అందేలా.. కొంచెం దృష్టిసారిస్తే అసలు సమస్యే ఉండదని చలివేంద్రం వాసులు చెబుతున్నారు. ప్రతీ వేసవిలో నీటి పాట్లు తప్పడంలేదని... ప్రభుత్వం స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి...